దళిత ఎమ్మెల్యేతో కూతురు ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యాయత్నం

దళిత ఎమ్మెల్యేతో కూతురు ప్రేమ వివాహం.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్యాయత్నం

అతడో ఎమ్మెల్యే… కావాల్సినంత డబ్బు అంతకు మించిన పలుకుబడి వుంది. అతడు కోరుకుంటే కోట్ల కట్నమిచ్చి మరీ పిల్లనిచ్చే సంబంధాలు వస్తాయి. అలాంటి అవకాశాన్ని కాదని ఓ సామాన్య అర్చకుడి కూతురిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానంటూ అమ్మాయి తల్లిదండ్రుల్ని కోరాడు. అయితే పెళ్లికి అంగీకరించపోవడంతో ఎమ్మెల్యే తన నివాసంలో వివాహం చేసుకున్నాడు. వివాహం పై సమాచారం అందుకున్న పెళ్లి కూతురు తండ్రి తట్టుకోలేకపోయాడు. పెళ్లిమండపంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

తమిళనాడులోని అన్నాడీఎంకే నేత కల్వకూరిచి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభు(34), అదే నియోజకవర్గానికి చెందిన సౌందర్య (19) లు అక్టోబర్ 5న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రభు దళిత వర్గం కాగా..సౌందర్య బ్రాహ్మణ వర్గానికి చెందిన అమ్మాయి. దీంతో కూతురు దళిత వర్గానికి చెందిన ప్రభును పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి స్వామినాధన్ అక్టోబర్ 5న పెళ్లి జరిగే మండపంలో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో నిప్పంటించుకున్నాడు.

అయితే  బాధితుడు స్వామినాధన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రభు తన కుటుంబానికి 15ఏళ్లుగా పరిచయం ఉందని, 4నెలలుగా తన కుమార్తెను ప్రేమించుకున్నట్లు చెప్పారు. కూతురు సౌందర్యను బెదిరించి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై ఎమ్మెల్యే ప్రభు మాట్లాడుతూ సౌందర్యను తాను కిడ్నాప్ చేసినట్లు, బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు.  సౌందర్యను నాలుగు నెలలుగా ప్రేమిస్తున్నా. మాపై ప్రచారం జరుగుతుండడంతో పెళ్లి చేసుకున్నట్లు వివరణిచ్చారు.