
- పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా మాణిక్కం ఠాగూర్
- ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా రేవంత్
- ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీలను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ కమిటీలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదముద్ర వేశారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ మణిక్కం ఠాగూర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నియమించారు. ఈ రెండు కమిటీల్లోనూ పీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా 17 మందికి చోటు కల్పించారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో 40 మందికి చోటు ఇచ్చారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సుదర్శన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, నాగం జనార్దన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, గడ్డం వినోద్, సీతక్క, పోదెం వీరయ్య, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, కోదండరెడ్డి, అనిల్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, అజ్మతుల్లా హుస్సేనికి చోటు కల్పించారు.