మంచిర్యాల జిల్లాలో అందరి ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక : ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేశ్కుమార్

మంచిర్యాల జిల్లాలో అందరి ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక : ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేశ్కుమార్

మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆమోదంతోనే డీసీసీ ప్రెసిడెంట్​ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్​నరేశ్​ కుమార్​అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ హోటల్​లో ప్రెస్​మీట్​నిర్వహించిన అనంతరం కాంగ్రెస్​ శ్రేణులతో జరిగిన మీటింగ్​లో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నికపై బూత్, మండలం, బ్లాక్ లెవల్​లో అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు.

 పార్టీ హైకమాండ్​ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీలకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. తాను మూడు రోజులు మంచిర్యాలలో అందుబాటులో ఉంటానని, ఆసక్తిగలవారు దరఖాస్తు ఇవ్వాలని తెలిపారు. పీసీసీ అబ్జర్వర్​అడువాల జ్యోతి, డాక్టర్​ పులి అనిల్ కుమార్, గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాగా డీసీసీ చైర్మన్​ కోసం సీనియర్​నాయకులు కేవీ ప్రతాప్, గడ్డం త్రిమూర్తి, నూకల రమేశ్​ దరఖాస్తు అందజేశారు..