
- ఏఐసీసీ అబ్జర్వర్ నరేశ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు: కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ నరేశ్ కుమార్ అన్నారు. ఆదివారం కాగజ్ నగర్ పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి చీఫ్‌గెస్ట్‌గా హాజరైన ఆయన మాట్లాడారు. పార్టీలోని కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం అభియాన్ ప్రధాన ఉద్దేశమన్నారు.
రాహుల్ గాంధీ ఆలోచనా విధానం ప్రకారం పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని చెప్పారు. జిల్లా అధ్యక్షుల ఎంపికలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని, అందరి అభిప్రాయం మేరకు ఎంపిక ఉంటుందని తెలిపారు. కార్య క్రమంలో ఆర్గనైజర్లు పులి అనిల్ కుమార్, అధువల జ్యోతి, బి.శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.