పదేండ్లు కష్టపడి పనిచేసిన వారికే పదవులు : సంపత్ కుమార్

పదేండ్లు కష్టపడి పనిచేసిన వారికే పదవులు : సంపత్ కుమార్

సూర్యాపేట, వెలుగు : పార్టీ జెండా పట్టుకొని పదేండ్లు కష్టపడి పనిచేసిన వారికే పదవులు లభిస్తాయని ఏఐసీపీ సెక్రటరీ, కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఇన్​చార్జి సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సంస్థాగత పునర్ నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంపత్​కుమార్​ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి ఒక సైన్యం కావాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నాశనం చేసిందని మండిపడ్డారు. సూర్యాపేట నియోజకవర్గం పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

 సమావేశంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, నాయకులు చకిలం రాజేశ్వరరావు, కోతి గోపాల్ రెడ్డి, సురేశ్ రావు, వీరన్న నాయక్, కక్కిరేణి శ్రీనివాస్, వేములకొండ పద్మ, చింతమల్ల రమేశ్, తిరుమల ప్రగడ అనురాధాకిషన్ రావు, గుడిపాటి నర్సయ్య, ఎలిమినేటి అభినయ్, తండు శ్రీనివాస్ యాదవ్, జావెద్ బేగ్, శ్రీనివాస్, నాగుల 
వాసు పాల్గొన్నారు.

కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం

తుంగతుర్తి, వెలుగు : కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని ఏఐసీసీ సభ్యుడు, జిల్లా ఎన్నికల పరిశీలకుడు సంపత్ కుమార్, ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు.

 గత పదేండ్ల నుంచి పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులను అధిష్టానం మరిచిపోదన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అనురాధాకిషన్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గిద్దరెడ్డి, నాయకులు గుడిపాటి నర్సయ్య, వెంకన్న, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.