ICC Players of the Month: బవుమాకు బ్యాడ్‪లక్: టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ హీరోకి ఐసీసీ అవార్డు

ICC Players of the Month: బవుమాకు బ్యాడ్‪లక్: టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ హీరోకి ఐసీసీ అవార్డు

సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. నామినీలుగా ఎంపికైన తన దేశానికే చెందిన టెంబా బావుమా, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకలను ఓడించి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. "ఈ అవార్డు అందుకోవడం ఒక గౌరవం. సౌతాఫ్రికా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. లార్డ్స్‌లో ఫైనల్ గెలవడం సౌతాఫ్రికాకు ఒక చారిత్రాత్మక క్షణం. ఇది మనమందరం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం" అని మార్క్రామ్ అవార్డు గెలుక్కుకున్నాక తెలిపాడు. 

ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023-25)ను సౌతాఫ్రికా గెలుచుకోవడంలో మార్క్రమ్ కీలక పాత్ర పోషించాడు. సూపర్ సెంచరీతో (207 బంతుల్లో 136: 14 ఫోర్లు) సఫారీ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. మార్క్రమ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించడంతో తాజాగా జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. మహిళా విభాగంలో  వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ జూన్ నెలకు గాను మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తర్వాత నాలుగుసార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న రెండో ప్లేయర్ గా నిలిచింది. 

Also Read:-మూడు పల్టీలు కొట్టిన స్టంప్: ఆర్చర్ ఇన్ స్వింగ్ ధాటికి పంత్ క్లీన్ బౌల్డ్

జూన్‌లో హేలీ మాథ్యూస్ అసాధారణంగా రాణించింది. సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మూడు వన్డేల్లో 104 పరుగులు చేసిన ఆమె, సిరీస్‌లో నాలుగు వికెట్లు కూడా పడగొట్టింది. "ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును మళ్ళీ అందుకోవడం గౌరవంగా ఉంది. ఇటీవల నా ఫామ్‌తో నేను సంతోషంగా ఉన్నాను. నా ప్రదర్శన జట్టు విజయానికి తోడ్పడడం నాకు సంతృప్తిని ఇస్తుంది. వ్యక్తిగతంగా ఈ జట్టుతో నేను ఇంకా చాలా సాధించాలనుకుంటున్నాను". అని హేలీ మాథ్యూస్ అవార్డు గెలుచుకున్నాక తెలిపింది. 

South Africa’s WTC Final hero Aiden Markram and West Indies all-rounder Hayley Matthews have been named the ICC Players of the Month for June 2025. pic.twitter.com/pofiyMUdzl

— CricTracker (@Cricketracker) July 14, 2025