ప్రమాదకరంగా మారిన కరోనా వ్యాప్తి

ప్రమాదకరంగా మారిన కరోనా వ్యాప్తి

 కరోనా వైరస్ విస్తరణ దేశంలో ప్రమాదకరంగా మారిందన్నారు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు. ప్రభుత్వాలు మరింత అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు గుమిగూడటంపై నిషేధం , భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, కంటైన్‌మెంట్‌ జోన్స్ ఏర్పాటు వంటి దశలను అమలు చేయాలని చెప్పారు. అంతేకాదు కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్యం వంటివి ఎక్కువగా చేపట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నారు. గతంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లను ఏ విధంగా విభజించామో మళ్ళీ అదే విధంగా  జోన్ల  ఏర్పాటు అవసరం ఉందన్నారు.