
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదని, హత్య చేశారనే ఆధారాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. టైమ్స్ న్యూస్ నౌ కథనం ప్రకారం..
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్త సుశాంత్ ది ఆత్మహత్య కాదని, మర్డర్ చేశారంటూ చేసిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి.
సుశాంత్ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్త ఎక్స్ పర్ట్ టీం అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సుశాంత్ డెడ్ బాడీని చూసిన సుధీర్ గుప్త నటుడిది ఆత్మహత్య కాదని, హత్యేనంటూ ఆడియో టేప్ లు వెలుగులోకి వచ్చాయి.
ఆడియో టేపుల ఆధారంగా ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్త వ్యాఖ్యలకు..సీబీఐ తయారు చేసిన రిపోర్ట్ కు అసలు సంబంధం లేదని తెలుస్తోంది.