భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ మహాసభలు ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుమ్మడి నర్సయ్య, సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చల రంగారెడ్డి తెలిపారు. కొత్తగూడెంలోని సంఘ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.
11న ఇల్లెందులో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 12,13 తేదీల్లో ప్రతినిధుల సభలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలపై చర్చిస్తామని తెలిపారు. సంఘం నేతలు ముద్దా బిక్షం, జాటోత్ కృష్ణ, బుర్రా వెంకన్న, పి.సతీష్ పాల్గొన్నారు.
