మీరేం చేసినా చూస్తూ ఊరుకోం.. చైనాకు భారత్ వార్నింగ్

మీరేం చేసినా చూస్తూ ఊరుకోం.. చైనాకు భారత్ వార్నింగ్

జోధ్‌‌పూర్: ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌‌కేఎస్ భదౌరియా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్‌‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందన్న కథనాల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీపై భదౌరియా సీరియస్ అయ్యారు. చైనా దూకుడుగా వ్యవహరిస్తే తామూ దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. జోధ్‌పూర్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లో భదౌరియా మాట్లాడారు. శత్రు దేశాల నుంచి దాడులను ఎదుర్కోవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ‘పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నాం. ఒకవేళ అలా కుదరకపోతే వాళ్లు (చైనా) ఏం చేస్తున్నా చూస్తూ కూర్చోం’ అని భదౌరియా పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా కొందరికి ట్రెయినింగ్ ఇస్తోందన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.