పెరిగిన ఎయిర్​పోర్ట్​ ప్యాసింజర్​​ ట్రాఫిక్

పెరిగిన ఎయిర్​పోర్ట్​ ప్యాసింజర్​​ ట్రాఫిక్

న్యూఢిల్లీ: తమ ఎయిర్​పోర్టుల్లో ప్యాసింజర్​ ట్రాఫిక్​ఈ ఏడాది సెప్టెంబరులో వార్షికంగా 23 శాతం పెరిగి 94.16 లక్షలకు చేరిందని  జీఎంఆర్​  ఎయిర్​పోర్ట్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​ ప్రకటించింది. అయితే నెలవారీగా ఇది కాస్త తగ్గింది.   సంస్థ షేర్లు శుక్రవారం 0.4 శాతం లాభపడ్డాయి. ఇదే కాలంలో ఎయిర్​ట్రాఫిక్​ మూవ్​మెంట్​ వార్షికంగా 14 శాతం పెరగగా, నెలవారీగా నాలుగు శాతం తగ్గి 62,230 లకు చేరింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి గరిష్టంగా 58,02,348 మంది ప్రయాణించారు. వార్షికంగా వీరి సంఖ్య 14 శాతం పెరిగింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 19,69,753 రాకపోకలు సాగించారు. వీరి సంఖ్య 21 శాతం పెరిగింది .

గోవా  ఎంఓపీఏలో ఇది 10 శాతం పెరిగి  3,26,952 మందికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయం 2024 మొదటి ఆర్నెళ్లలో రికార్డుస్థాయిలో 3.5 మిలియన్ల ప్రయాణీకుల మార్కును దాటిందని జీఎంఆర్​  తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం 2024 మొదటి ఆర్నెళ్లలో 1.2 మిలియన్ ప్రయాణీకుల మార్కును దాటింది. ఈ ఏడాది జూన్​లో జీఎంఆర్​ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోన్ నికర అమ్మకాలు విలువ రూ. 66.77 కోట్లకు చేరుకుంది. వార్షికంగా వీటి విలువ 185.34 శాతం పెరిగింది. జూన్ 2022లో 23.40 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది.  నికర లాభం జూన్ 2022లో 21.14 కోట్లు కాగా ఈసారి 144.61 శాతం వృద్ధి చెందింది.  ఇబిటా  రూ. 65.51 కోట్లకు పెరిగింది.