ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

ఎయిర్ టెల్ తన కొత్త 4జీ కష్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఉచితంగా 5 జీబీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొత్త వినియోగదారులు 3జి నుంచి 4జికి అప్‌గ్రేడ్ చేసుకున్న వారికి 1జీబీ చొప్పున మొత్తం ఐదు కూపన్లు లభిస్తాయి. సబ్‌స్క్రిప్షన్ అయిన తర్వాత 90 రోజుల్లోపు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఒక్కో కూపన్ కు మూడురోజల సమయం ఉంటుంది. అయితే కూపన్ కోడ్ ఒక్కనెంబర్ కు మాత్రమే వర్తిస్తాయి. నెంబర్ మార్చితే కూపన్ లకు ఆఫర్ లభ్యం కాదు.