న్యూఢిల్లీ: టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి రూ. 8,651 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ. 4,153.4 కోట్లుగా ఉంది. కార్యకలాపాల నుంచి వచ్చే ఆదాయం 25.7 శాతం పెరిగి రూ. 52,145 కోట్లకు చేరింది.
భారతి ఎయిర్టెల్కు భారతదేశం నుంచి వచ్చే ఆదాయం ఏడాదికి 22.6 శాతం పెరిగి రూ. 38,690 కోట్లుగా నమోదైంది. మొబైల్ సగటు రాబడి (ఏఆర్పీయూ) సుమారు 10 శాతం పెరిగి రూ. 256 కి చేరింది.
 
