ఎయిర్​టెల్​ నుంచి ఫ్రాడ్ డిటెక్షన్​ సొల్యూషన్

ఎయిర్​టెల్​ నుంచి ఫ్రాడ్ డిటెక్షన్​ సొల్యూషన్

హైదరాబాద్​, వెలుగు:   ఎయిర్‌‌టెల్ తన కస్టమర్ల కోసం ఫ్రాడ్ డిటెక్షన్​ సొల్యూషన్​ ప్రారంభించింది. ఇది ఈ–మెయిల్, ఓటీటీ యాప్‌‌లు, ఎస్‌‌ఎంఎస్‌‌ల ద్వారా వచ్చే మోసపూరిత వెబ్‌‌సైట్‌‌లను గుర్తించి నిరోధిస్తుంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన టెక్నాలజీలతో ఈ సొల్యూషన్​ను తయారు చేశామని తెలిపింది.   

ఫిషింగ్ దాడులు, మాల్వేర్ వ్యాప్తి చేసే వెబ్‌‌సైట్‌‌లను,  ఇతర హానికరమైన లింక్‌‌లను బ్లాక్ చేస్తుంది. ఎయిర్‌‌టెల్ నెట్‌‌వర్క్‌‌లోనే కాకుండా, ఇతర నెట్‌‌వర్క్​ల ద్వారా వచ్చే మోసపూరిత లింక్‌‌లను కూడా గుర్తిస్తుంది. ఈ సేవను ఉచితంగానే వాడుకోవచ్చు.