వరంగల్ లో ఎస్ఐ ఓవరాక్షన్..అర్థరాత్రి రెస్టారెంట్లో మహిళపై దాడి

వరంగల్ లో  ఎస్ఐ ఓవరాక్షన్..అర్థరాత్రి  రెస్టారెంట్లో మహిళపై దాడి

వరంగల్ జిల్లాలో  ఎజె మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ ఓవరాక్షన్  చేశారు. అర్ధరాత్రి రెస్టారెంట్ నిర్వాహకులపై ఎస్సై దాడి చేశారు.  రెస్టారెంట్ నిర్వహిస్తున్న మహిళ పై చేయిచేసుకున్నారు. 

వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ లో ఆగస్టు 22న రాత్రి ఈ ఘటన జరిగింది.  అక్కడున్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యింది. హోటల్ గ్యాస్ అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఎస్సై శ్రీకాంత్ దాడి చేశారని మహిళ ఆరోపిస్తోంది. దీనిపై  మిల్స్ కాలనీ పీఎస్ లో ఎస్సై శ్రీకాంత్ పై ఫిర్యాదు చేసింది బాధితురాలు

ఎస్ ఐ  తనను కులం పేరుతో దూషించడమే గాకుండా అసభ్య పదజాలంతో దూషించారని  మహిళ ఫిర్యాదు చేసింది. ఫుల్ గా తాగి వచ్చి తనను చెంపై కొట్టారని..అడ్డుకోవడానికి వచ్చిన తన కుమారుడిపై దాడి చేశారని ఆరోపించారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..మీ అంతు చూస్తామంటూ బెదిరించారని మహిళ ఫిర్యాదులో తెలిపారు. ఎస్ఐ శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని  చెప్పారు.