మెస్మరైజింగ్ లుక్స్

మెస్మరైజింగ్ లుక్స్

గురువారం బాలీవుడ్లో రెండు సినిమాల ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. ఒకటి ‘మైదాన్’, రెండోది ‘థప్పడ్’. లెజెండరీ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ ‘మైదాన్’. సయ్యద్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నారు. ఆయన సాదాసీదాగా తయారై చేతిలో బ్యాగ్, గొడుగు పట్టుకుని బాల్ని తన్నుతున్నట్టుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. అమిత్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో మరో ముగ్గురితో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రియమణి హీరోయిన్. ఏప్రిల్కి షూటింగ్ పూర్తవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 27న విడుదల కానుంది. రెండోది తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘థప్పడ్’. చెంపదెబ్బ కొట్టిన తర్వాత ఉండే మూమెంట్ని చూపిస్తున్న ఈ పోస్టర్.. కాన్సెప్ట్లోని డెప్త్ని తెలుపుతోంది. రెండు లుక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.