నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా అజిత్ దోవల్ కొనసాగింపు

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా అజిత్  దోవల్ కొనసాగింపు

న్యూఢిల్లీ:  నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్ తిరిగి మూడోసారి నియమితులయ్యారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా కూడా రీఅపాయింట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి నియామకం జూన్10 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వీరు ఆ పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది. 

ఇద్దరికీ కేబినెట్ హోదా ర్యాంకును కేటాయించింది. ప్రధానికి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్​ కపూర్ లను తిరిగి నియమించడానికి కూడా కేబినెట్ కమిటీ ఓకే చెప్పింది. వీరు జూన్ 10 నుంచి రెండేండ్ల పాటు విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఈ ఇద్దరు అధికారులకు భారత ప్రభుత్వ సెక్రటరీ హోదాను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.