నాల్గో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్..అజిత్ పవార్కు తప్పిన ప్రమాదం

నాల్గో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్..అజిత్ పవార్కు తప్పిన ప్రమాదం

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తృటిలో  ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పూణెలోని  ఓ ఆస్పత్రిలో  పవార్ ఎక్కిన లిఫ్ట్ నాలుగో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందపడింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద సమయంలో తనతో పాటు ఓ డాక్టర్, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.  అయితే ఈ ఘటన జనవరి 14న జరిగినట్లు పవార్ చెప్పారు. ఈ విషయాన్ని అప్పటి నుంచి తన భార్యకు, తల్లికి కూడా చెప్పలేదన్నారు. ముందే చెబితే  మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదన్నారు.

భారమాతిలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్ పవార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పూణెలో ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు థర్డ్ ఫ్లోర్  నుంచి ఫోర్త్ ఫ్లోర్ కు వెళ్లేందుకు  లిఫ్ట్ ఎక్కినం. కాసేపటికే  కరెంట్ పోయింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్ బద్దలు కొట్టి  నన్ను బయటకు లాగారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చెబితే నిన్ననే బ్రేకింగ్ న్యూస్ అయ్యేది. కానీ చెప్పకుండా ఉండలేక చెబుతున్నా’ అని అజిత్ పవార్ అన్నారు.