అజ్మీర్‌‌ దర్గాకు చాదర్‌ పంపిన కేసీఆర్‌

అజ్మీర్‌‌ దర్గాకు చాదర్‌ పంపిన కేసీఆర్‌

అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంపే ‘చాదర్’ ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది కూడా సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్ లో ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపిన అనంతరం చాదర్ ను వక్ఫ్ బోర్డు అధికారులకు అందచేశారు. వారు దాన్ని అజ్మీర్ దర్గాలో సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వక్ప్ బోర్డు ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మరింత ప్రగతి పథంలో సాగాలని,రాష్ట్ర, దేశ ప్రజలందరూ ఐకమత్యంతో జీవించేలా దీవించాలని అల్లాను ప్రార్థించారు.