ఎమ్మెల్యే ఇంట్లో దొరికిన ఏకే-47

ఎమ్మెల్యే ఇంట్లో దొరికిన ఏకే-47

ఎమ్మెల్యే ఇంట్లో ఏకే -47 తుపాకీ దొరకడంతో స్థానికంగా కలకలం రేపింది. బీహార్‌ కు చెందిన‌ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఇంట్లో నుంచి శుక్రవారం ఏకే-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మోకామాలో ఉన్న ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు గాలింపు చేప‌ట్టారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు.