
ముంబై : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి -9 నుంచి వీరి వివాహ వేడుకలు ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు జియో వరల్డ్ సెంటర్ వేదిక కానున్నట్లు జాతీయ మీడియా తెలిపింది.
ఆకాశ్ అంబానీ- వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా నిశ్చితార్థం గతేడాది జూన్ లో జరిగింది. అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి సోమవారం సాయంత్రం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆకాశ్- శ్లోకాల వివాహ ఆహ్వాన మొదటి పత్రికను గణనాథుని పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.