యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (LENIN) ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. ఇవాళ ఆగస్ట్ 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బ్లాక్‌బస్టర్ మూవీ.. కొన్ని గంటల్లోనే జీ5 Globalలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ రికార్డు క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు జీ5 మరియు చిత్రబృందం కృతజ్ఞతలు తెలిపింది.
మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. జులై 10, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గ్రామీణ నేపథ్యం, యాక్షన్, ఎమోషన్స్, పగ, ప్రతీకారాలతో తెరకెక్కిన ‘లెనిన్’లో అఖిల్ తన రా అండ్ రస్టిక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా హవా కొనసాగిస్తూ #BlockbusterLENIN పేరుతో ట్రెండింగ్‌లో నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ రోర్..
డైరెక్టర్ మురళి కిషోర్ తెరకెక్కించిన ‘లెనిన్’ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బలమైన కథనం, రస్టిక్ విజువల్స్, సహజమైన పాత్రలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించి ప్రశంసలు అందుకున్నారు. ఆయన నటనలోని ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చూపించిన ఇంటెన్సిటీ ప్రేక్షకులను మెప్పించాయి. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తన పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. అలాగే అఖిల్ కెరీర్‌లో ఫస్ట్ రూ.వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. గ్రామీణ రాజకీయం, ప్రేమ, పగ, ప్రతీకారం, భావోద్వేగాలతో నిండిన లెనిన్ తో వీకెండ్ ఎంజాయ్ చేసేయండి.
‘లెనిన్’ కథ:
చిత్తూరు జిల్లా శ్రీ రామాపురం గ్రామంలో జరిగే ప్రసిద్ధ జాతర నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. అనాథ అయిన లెనిన్‌ను ఊరి పెద్ద జయంతమ్మ చేరదీసి తన కొడుకు వసంత్‌తో కలిసి పెంచుతుంది. గ్రామ పెద్దల గౌరవం, రాజకీయాలు, జాతర సంప్రదాయాల మధ్య లెనిన్ జీవితం సాగుతుంది. జాతరలో చూసిన భారతి అనే యువతిని లెనిన్ ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది.
ALSO READ : వీకెండ్‌కు పర్ఫెక్ట్ తమిళ్ థ్రిల్లర్..
కానీ పరిస్థితుల కారణంగా భారతి పెళ్లి వసంత్‌తో నిశ్చయమవుతుంది. వీరి ప్రేమ విషయం తెలిసిన వసంత్ వారికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆ తర్వాత జరిగే కుట్రలు, దాడులు లెనిన్ జీవితాన్ని మార్చేస్తాయి. తన ప్రేమను, తన వాళ్లను కాపాడుకునేందుకు లెనిన్ చేసే పోరాటం, శత్రువులపై అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే సినిమా కథ.
