గర్ల్ ఫ్రెండ్ ఉంది.. సో కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసు

V6 Velugu Posted on Oct 15, 2021

రియల్ లైఫ్‌‌లో తనకొక గాళ్ ఫ్రెండ్ ఉందంటున్న అఖిల్...  రిలేషన్ షిప్‌‌లో, మ్యారీడ్ లైఫ్‌‌లో వచ్చే ప్రాబ్లెమ్స్‌‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌లర్’తో  సొల్యూషన్ చెబుతానంటున్నాడు. తను హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకులు ముందుకొస్తున్న సందర్భంగా అఖిల్ చెప్పిన ముచ్చట్లు..

అరవింద్ గారు ఫోన్ చేసి లవ్‌‌స్టోరీ చేయాలన్నప్పుడు.. మళ్లీ లవ్‌‌స్టోరీనా అనుకున్నా.  కానీ కథ విన్నాక ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదనిపించింది. మన డైలీ లైఫ్‌‌లోని రిలేషన్ షిప్‌‌, మ్యారీడ్ లైఫ్‌‌లో వచ్చే ప్రాబ్లెమ్స్‌‌కి సొల్యూషన్ చెప్పడం అనే పాయింట్ బాగా నచ్చింది. రియల్ లైఫ్‌‌లో  నాకూ ఓ గాళ్ ఫ్రెండ్ ఉంది కనుక కొన్ని ప్రాబ్లెమ్స్ తెలుసు. ఈ సబ్జెక్ట్  అందరికీ రిలేటెడ్‌గా ఉంటుంది. అందుకే ఫ్రెష్‌‌గా అనిపించింది. యుఎస్ నుంచి వచ్చిన హర్ష అనే తెలుగబ్బాయి తక్కువ టైమ్‌‌లో పెళ్లి చేసుకుని తిరిగి వెళ్లిపోవాలనుకుంటాడు. సోల్‌‌మేట్ కోసం సెర్చ్ చేస్తూ కన్ఫ్యూజ్డ్ అబ్బాయి నుంచి కాన్ఫిడెంట్ మ్యాన్‌‌గా ఎలా మారతాడు అనేదే కథ. విభా క్యారెక్టర్‌‌‌‌లో స్టాండప్ కమెడియన్‌‌గా నటించింది పూజా హెగ్డే.  చాలా ఎనర్జీతో  కనిపిస్తుంది. తెలుగు రాకపోయినా చాలా కాన్ఫిడెంట్‌‌గా మాట్లాడింది. తన హార్డ్‌‌ వర్క్‌‌ని రెస్పక్ట్ చేస్తాను. సినిమాలో పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ కోసం ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియాతో పాటు ఏడెనిమిది మంది హీరోయిన్స్‌‌తో సీన్స్ చేశాం. కానీ సినిమాలో వాడింది నాలుగైదు సీన్స్  మాత్రమే. ‘సిసింద్రీ’ తర్వాత ఆమని గారితో మళ్లీ కలిసి నటించడం హ్యాపీ.

Tagged love, Special, interview, , most eligible bachelor, Akhil Akkineni

Latest Videos

Subscribe Now

More News