కిరాణ మర్చంట్ కొడుకు సివిల్ సర్వెంట్

కిరాణ మర్చంట్ కొడుకు సివిల్ సర్వెంట్
  • అఖిల్​ మహాజన్ ఐపీఎస్
  • కిరాణ మర్చంట్​ కొడుకు సివిల్​ సర్వెంట్​ అయ్యిండు
  • ఎలాంటి కోచింగ్​ లేకుండానే ఆలిండియా 213 ర్యాంక్​  
  • లా అండ్​ ఆర్డర్, యూత్  మోటివేషన్, పబ్లిక్​ అవేర్నెస్​కు ప్రాధాన్యం అంటున్న యంగ్​ఆఫీసర్​

మంచిర్యాల, వెలుగు: కంప్యూటర్​ సైన్స్​ చదువుకున్నాడు. మైక్రోసాఫ్ట్​, ఇతర కంపెనీల్లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా వర్క్​ చేశాడు.  ఓ ఫ్రెండ్​ సజెషన్​తో జాబ్​కు రిజైన్​ చేసి సివిల్స్​కు గురి పెట్టాడు. ఫోర్త్​ అటెంప్ట్​లో ఆలిండియా 213 ర్యాంక్​ సాధించి ఐపీఎస్​కు సెలక్టయ్యాడు. సిద్దిపేట జిల్లాలో ప్రొబేషన్​ కంప్లీట్ చేసుకొని ఇటీవలే మంచిర్యాల ఏసీపీగా చార్జి తీసుకున్నాడు. అనుకోకుండా ఐపీఎస్​ అయ్యానంటున్న ఈ యువ ఆఫీసర్ లా అండ్​ ఆర్డర్, యూత్​ మోటివేషన్​, పబ్లిక్​ అవేర్నెస్​లక్ష్యంగా ముందుకెళ్తానని చెబుతున్నారు.

అనుకోకుండా ఐపీఎస్​...  
సొంతూరు జమ్మూ. స్కూలింగ్​ అక్కడే జరిగింది. తర్వాత ఇంజినీరింగ్. 2007లో హైదరాబాద్​ జేఎన్టీయూ క్యాంపస్​లో సీటొచ్చింది. 2011లో బీటెక్​ (ఈసీఈ) కంప్లీట్ అయ్యింది. వెంటనే సాప్ట్​వేర్​ఇంజినీర్ జాబ్​ వచ్చింది. మైక్రోసాఫ్ట్​తో పాటు మరొక కంపెనీలో టూ ఇయర్స్​వర్క్​ చేశాను. 2013లో ఢిల్లీలో ఒక ఫ్రెండ్​ను కలిశాను. తన ద్వారా సివిల్స్ గురించి తెలిసింది. ఢిల్లీలో వన్​ మంత్​​ కోచింగ్​కు వెళ్లాను. ఇంట్రెస్ట్ ​అనిపించలేదు. మళ్లీ జమ్మూ వెళ్లిపోయాను. ఇంటి దగ్గరే సొంతంగా ప్రిపేర్​ అయ్యాను. ఆన్​లైన్​లో కావాల్సినంత మెటీరియల్ ఉంది. సబ్జెక్ట్​ ఎక్స్​పర్ట్స్​ క్లాస్​లు, ర్యాంకర్స్​ సక్సెస్ స్టోరీలు వింటూ నోట్స్​ రాసుకున్నా. డెయిలీ టెన్​ టు ఫిఫ్టీన్​ అవర్స్​ స్టడీ చేసేది. జాగ్రఫీ ఆప్షనల్​ సబ్జెక్ట్​గా 2014 నుంచి 2017 వరకు ఫోర్త్​అటెంప్ట్​చేశాను. 2017లో ఆలిండియా 213 ర్యాంక్​ వచ్చింది. ఐపీఎస్​గా తెలంగాణ క్యాడర్​కు సెలక్ట్​ అయ్యాను. ఫోర్టీన్​ ఇయర్స్​ నుంచే హైదరాబాద్​తో రిలేషన్​ ఉన్నందున మళ్లీ ఇక్కడికి రావడం హ్యాపీ. సిద్దిపేట జిల్లా కుకునూర్​పల్లి పోలీస్​స్టేషన్​లో ప్రొబేషన్​ కంప్లీట్​ చేసుకొని ఇటీవలే మంచిర్యాల ఏసీపీగా వచ్చాను. వాస్తవానికి ఢిల్లీలో ఫ్రెండ్​ను కలిసేంత వరకు ఎప్పుడూ సివిల్స్​ గురించి ఆలోచించలేదు. ఆయన సజెషన్​తో సివిల్​ సర్వెంట్ స్టేటస్​ను ఎంజాయ్​ చేయడం కోసమైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్​ కావాలనుకున్నా. ప్రిపరేషన్​ స్టార్ట్​ చేసిన దగ్గర నుంచి సొసైటీ గురించి అనేక విషయాలు తెల్సుకున్నా. దాంతో నా వే ఆఫ్​థింకింగ్​ కంప్లీట్​గా చేంజ్​ అయ్యింది. రియల్లీ ఇట్స్ ఏ బిగ్ చాలెంజ్​!  

మూడు లక్ష్యాలతో ముందుకు... 
లా అండ్​ ఆర్డర్... యూత్​ మోటివేషన్​... పబ్లిక్​ అవేర్నెస్... నా ముందున్న లక్ష్యాలు. ఐపీఎస్​ ఆఫీసర్​గా లా అండ్​ ఆర్డర్​కు ఫస్ట్​ ఇంపార్టెన్స్​ ఇస్తా. కంప్లైంట్​ వచ్చిందంటే ఎఫ్​ఐఆర్​ ఫైల్​ చేయాలి. ఎంక్వైరీలో పార్శియాలిటీ ఉండకూడదు. నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడాల్సిందే. ఫ్రెండ్లీ పోలిసింగ్​కు ప్రాధాన్యం ఇస్తా.  కమ్యూనిటీ సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తా. చాలామంది యూత్​ హయ్యర్​ స్టడీస్​ చేసినా సరైన గైడెన్స్​ లేక జాబ్స్​ రావడం లేదు. వాళ్లకు ఎస్సై, కానిస్టేబుల్​తో పాటు ఇతర కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​ కోసం కోచింగ్​ సెంటర్లు ఏర్పాటు చేయాలి. జాబ్స్​ రానివాళ్లు తమకున్న నాలెడ్జ్​తో అగ్రికల్చర్​, బిజినెస్​, ఇతర రంగాల్లో సక్సెస్​ సాధించాలి. ఎడ్యుకేషన్​, హెల్త్​కేర్​, ఉమెన్​ ఎంపవర్​మెంట్​ వంటి అంశాల్లో పబ్లిక్​లో అవేర్​నెస్​ కోసం కృషి చేస్తా. ఈ ప్రాంతం యూత్​ సివిల్స్​ సర్వీసెస్​కు రావాలి. దానికి అవసరమైన గైడెన్స్​ అందిస్తా. 

మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ... 
మాది మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ. ఫాదర్​ రాకేష్​కుమార్​ గుప్తా హోల్​సేల్​ అండ్​ రిటేల్​ మర్చంట్. కిరాణా షాపు​లో ఆయనకు హెల్ప్​ చేస్తూనే... సివిల్స్​కు ప్రిపేర్ ​అయ్యాను. మదర్​ ఊర్మిల్​ మహాజన్​ హోమ్​ మేకర్​. బ్రదర్​ నిఖిల్​ మహాజన్ డాక్టర్​. జమ్మూలోనే గ్యాస్ర్టో ఎంటరాలసిస్ట్​గా పనిచేస్తున్నారు. సిస్టర్​ అషిమా మహాజన్​ ఎంబీఏ గ్రాడ్యుయేట్. దిస్​ ఈజ్​ మై ఫ్యామిలీ.