రొమాంటిక్ హనీమూన్

రొమాంటిక్ హనీమూన్

చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా  బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘హనీమూన్ ఎక్స్‌‌‌‌ప్రెస్’. కె కె ఆర్, బాల రాజ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం  ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన అమల అక్కినేని మాట్లాడుతూ ‘యాక్టింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్‌‌‌‌లో ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌గా బాల అమెరికాలో చాలా కాలం పనిచేశారు.

టీచింగ్ ఒక బాధ్యత అయితే.. ఫిల్మ్ మేకింగ్ మరో సవాలు లాంటిది. మా అన్నపూర్ణ కాలేజ్ ఫ్యాకల్టీలు, స్టాఫ్, స్టూడెంట్స్‌‌‌‌ను  ఈ చిత్రంలో తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇక సినిమా టీజర్ ఫన్నీగా, రొమాంటిక్‌‌‌‌గా ఉంది. ఈరోజు సమాజంలోని వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ టీమ్‌‌‌‌కు ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.

ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నట్టు దర్శకుడు బాల రాజశేఖరుని ప్రకటించారు. తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ ఇతర  పాత్రలు పోషించారు.