
అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ‘ఏఎన్నార్100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ఫిల్మ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పాటు వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా లాంటి 25 పట్టణాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు ఏఎన్నార్ నటించిన పది క్లాసిక్ సినిమాలను ప్రదర్శించనున్నారు.
దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, భార్యాభర్తలు, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మనం చిత్రాలను ప్రదర్శిస్తారు. నేషనల్ ఫిల్మ్ ఆర్క్వైవ్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎఫ్‌డిసి), పీవీఆర్ ఐనాక్స్ సహకారంతో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని కుటుంబం ఈ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది.