అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై దాడి కేసు : నిందితుడు అరెస్ట్

అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై దాడి కేసు : నిందితుడు అరెస్ట్

గుజ‌రాత్‌ లోని అక్ష‌ర‌ధామ్ ఆల‌యంపై 2002లో జ‌రిగిన దాడి కేసులో నిందితుడు యాసిన్ భ‌ట్‌ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. యాంటీ టెర్ర‌రిజం స్క్వాడ్‌(ATS) పోలీసులు భ‌ట్‌ ను క‌శ్మీర్‌ లోని అనంత్‌నాగ్‌ లో అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ కోసం శుక్రవారం అత‌న్ని అహ్మ‌దాబాద్‌ కు తీసుకువ‌చ్చారు.

2002, సెప్టెంబ‌ర్ 24వ తేదీన ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు అక్ష‌ర‌ధామ్ ఆల‌యంలోకి ప్ర‌వేశించి కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో 30 మంది మ‌ర‌ణించారు. 80 మంది గాయ‌ప‌డ్డారు. ఎన్ఎస్‌జీ క‌మాండోలు వ‌చ్చి.. ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుజ‌రాత్ పోలీసులు అరెస్టు చేశారు.