ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి ఉగ్రస్థావరాలపై అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆల్‌ఖైదా కీలక నేత ఆసిం ఉమర్ హతమయ్యాడు. గతంలో నిర్వహించిన దాడుల్లో ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జాబిన్ లాడెన్ మృతి చెందిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల నిర్ధారించారు. అయితే.. అతడిని ఎప్పుడు హతమార్చిందన్న వివరాలను మాత్రం బయటపెట్టలేదు.

