Health Alert: పిల్లల్లో పెరుగుతున్న హైపర్ టెన్షన్.. అలర్ట్ అవ్వకపోతే ప్రమాదమే..

Health Alert: పిల్లల్లో పెరుగుతున్న హైపర్ టెన్షన్.. అలర్ట్ అవ్వకపోతే ప్రమాదమే..

హైపర్ టెన్షన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య.మొదట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఈ సమస్య తీవ్రమైతే గుండె పోటు, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది.  రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించటం వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. జన్యుపరమైన అంశాలు, వయసు మీదపడటం వంటి కారణాలు హైపర్ టెన్షన్ కి దారి తీస్తాయి. కానీ, ఇటీవల ఎయిమ్స్ అయయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇండియాలో 10 నుండి 19ఏళ్ళ వయసుగల పిల్లల్లో 20శాతం మందిలో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో రక్తపోటు ఉన్నట్లు తేలింది. పరిణామాన్ని ప్రమాద ఘంటికగా భావించి జాగ్రత్త పడకపోతే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధులు వంటి ప్రాణాంతక సమస్యల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.లైఫ్ స్టైల్, ఒత్తిడి,ఆహార అలవాట్లే పిల్లల్లో అధిక రక్తపోటు సమస్య పెరగటానికి కారణమని అంటున్నారు డాక్టర్లు.

అధిక బరువు, ధూమపానం, శ్రమ లేని లైఫ్ స్టైల్ కూడా హైపర్ టెన్షన్ కి దారి తీస్తాయి. ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండాలంటే స్కూళ్లలోనే పిల్లలకు అధికరక్తపోటు పట్ల అవగాహన సదస్సులు నిర్వహించటం, హెల్తీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకునేలా ట్రైన్ చేయటం, ఆరోగ్యమైన ఆహార అలవాట్ల గురించి అవగాహన కల్పించటం వంటి చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.