ఓవరాల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ

ఓవరాల్ చాంపియన్ షిప్ గెలుచుకున్న అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ

కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో  మూడు రోజుల కింద నిర్వహించిన  మేనేజ్ మెంట్ మీట్‌‌‌‌లో ఓవరాల్ చాంపియన్ షిప్‌‌‌‌ను అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ విద్యార్థులు గెలుచుకున్నట్లు  కరస్పాండెంట్‌‌‌‌ వి.రవీందర్ రెడ్డి తెలిపారు.  శనివారం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ ఆరోహణ2024  పేరిట  ఏడు అంశాల్లో  పోటీలు జరగగా, బిజినెస్ క్విజ్, ఆడమ్ కింగ్,  రోల్ ప్లే,  తదితర అంశాల్లో ప్రతిభ కనబరిచి  చాంపియన్ షిప్  సాధించారన్నారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్స్ విజయలక్ష్మి, జి.చంద్రశేఖర్ రెడ్డి, పాల్గొన్నారు.