ఆలియా భట్ కు ముంబై కోర్టు సమన్లు

V6 Velugu Posted on Mar 25, 2021

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, సినీ నటి  ఆలియా భట్ కు ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. భన్సాలీ దర్శకత్వంలో గంగూభాయి కఠియావాడీ అనే సినిమాను ఆలియా భట్ చేస్తోంది. అయితే.. ఆ సినిమా స్టోరీ చనిపోయిన తన తల్లిని కించపరిచేలా ఉందంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఆ పిటిషన్ ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు..తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయో రావ్జీ తెలిపారని.. వారు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనినదని తెలిపింది. ఆ తర్వాత  మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా ఆలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది. 

Tagged Alia Bhatt

Latest Videos

Subscribe Now

More News