Fact Check : ఇవి అలియా భట్ డీప్ ఫేక్ ఫొటోలు..

Fact Check : ఇవి అలియా భట్ డీప్ ఫేక్ ఫొటోలు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika mandanna)కు డీప్ ఫేక్ వీడియో టాలీవుడ్ లోనే కాదు..దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. స్టార్ సెలబ్రెటీస్ అందరు ఈ వీడియోపై స్పందించారు. ఆ ఫేక్ వీడియో చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. 

ALSO READ :- రైతులతో మాకున్నది ఓటు బంధం కాదు.. పేగు బంధం : హరీష్ రావు

అయిన సెలబ్రెటీస్ కు ఈ డీప్ ఫేక్ తిప్పలు తప్పడంలేదు. రష్మిక విషయం ఇంకా మరిచిపోకముందే మరో టాప్ సెలబ్రెటీ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ముఖంతో తన ముఖాన్ని మార్చుకున్న ఒక అమ్మాయి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోన్నాయి. పూల దుస్తులు ధరించి.. కెమెరాలో తన ఫొటోస్ కి మ్యూజిక్ ను యాడ్ చేసి..అలాగే అసభ్యకరమైన సిగ్నల్స్ తో తన ఫోటోలను మలుచుకుంది. ఇది ఫేక్ వీడియో అయినప్పటికీ..సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తూ..ఖండిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt ? (@aliaabhatt)

 

ఇప్పటికే టాప్ సెలబ్రెటీస్ అయిన ..రష్మిక మందన్న, కత్రినా కైఫ్ మరియు కాజోల్‌లతో సహా పలువురు ఇతర నటీమణులు AI టెక్నాలజీ దుర్వినియోగానికి గురైన వారే. లేటెస్ట్ గా అలియా భట్ ఫొటోస్ కూడా రావడంతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా భయాందోళన కలుగుతోంది.