- ఇక అందరూ కార్మిక భద్రత పరిధిలోకి: సంజయ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో వర్కింగ్ జర్నలిస్టుల నిర్వచనం మారిపోయిందని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఉపాధ్యాయ అన్నారు. ఇప్పటిదాకా కేవలం ప్రింట్ మీడియా జర్నలిస్టులు మాత్రమే వర్కింగ్ జర్నలిస్టుల చట్టం కింద ఉన్నారని, ఇప్పుడు టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ అధికారికంగా జర్నలిస్టుల సంక్షేమ చట్టం పరిధిలోకి, కార్మిక భద్రతా పరిధిలోకి వచ్చారన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో డబ్ల్యూజేఐ దీర్ఘకాల పోరాటం ఫలించిందన్నారు.
