ఇబ్రహీంపట్నం, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కొంగరకలాన్‌లోని కలెక్టరేట్లో మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులతో ఆయన మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సభ్యులకు కలెక్టర్ కంగ్రాట్స్ చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన 252 జీఓ ప్రకారం అన్ని రూల్స్ పాటిస్తూ అక్రెడిటేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా చర్చించుకుని ఈ ప్రాసెస్‌ను సక్సెస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ మీటింగ్‌లో డీపీఆర్ఓ బాలేశ్వరితో పాటు కమిటీ మెంబర్లు శ్రీకాంత్ రెడ్డి, శేఖర్ సాగర్, సయ్యద్ ఇక్రముల్లా హుస్సైని పాల్గొన్నారు.

