టెర్రరిస్టులంతా మదర్సాల్లోనే పెరిగారు

టెర్రరిస్టులంతా మదర్సాల్లోనే పెరిగారు

మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద కామెంట్స్

భోపాల్: టెర్రరిస్టులు మదర్సాల్లోనే తయారవుతున్నారని మధ్యప్రదేశ్‌‌ మంత్రి, బీజేపీ నేత ఉషా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఫండమెంటలిస్టులతో పాటు దేశంలోని ఉగ్రవాదులు మదర్సాల్లోనే పెరిగారు. పిల్లలంతా పిల్లలే, విద్యార్థులు అందరూ విద్యార్థులే. కాబట్టి అన్ని మతాల పిల్లలను ఒకే చోట చేర్చి.. ఒకే తరహా విద్యను బోధించాలి. మతపరమైన విద్య మతోన్మాదాన్ని, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. మదర్సాల్లో ఏ సంస్కృతిని బోధిస్తున్నారు? ఈ దేశ పౌరులుగా చూస్తే..  ప్రాథమికవాదులతో పాటు ఉగ్రవాదులందరూ మదర్సాల్లోనే తయారయ్యారు. జమ్మూ కాశ్మీర్‌‌ను టెర్రరిస్టుల ఫ్యాక్టరీగా మార్చారు. మదర్సాలను సరైన విద్యా విధానంతో అనుసంధానించాలి. తద్వారా విద్యార్థుల్లో జాతీయత, సమాజంపై అవగాహన పెంచాలి. ఏదేమైనప్పటికీ మదర్సాలకు ఇస్తున్న ఆర్థిక చేయూతను ప్రభుత్వం నిలిపివేయాలి. వక్ఫ్ బోర్డు ప్రపంచంలోనే అత్యంత బలమైన సంస్థ. కాబట్టి మదర్సాలకు ఆ బోర్డు ఫండింగ్ చేయాలి’ అని ఉషా చెప్పారు.