సూర్యుడిపైనా అధ్యయనం.. ఆదిత్య ప్రయోగానికి సర్వం సిద్దం..

సూర్యుడిపైనా అధ్యయనం.. ఆదిత్య ప్రయోగానికి సర్వం సిద్దం..

చంద్రయాన్​–3 సక్సెస్​తో ఉత్సాహంగా ఉన్న ఇస్రో.. సూర్యుడిపైనా అధ్యయనం కోసం భారీ ప్రయోగానికి రెడీ అయింది. ‘ఆదిత్య- ఎల్-1’ శాటిలైట్ ను నింగిలోకి పంపుతోంది. శనివారం ఉదయం 11.50 గంటలకు  శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్1 శాటిలైట్​ను మోసుకుని పీఎస్ఎల్వీ-సీ 57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని స్టడీ చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే. భూమికి దూరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇరవై నాలుగు గంటలూ సూర్యుడి వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజియన్--1 (ఎల్1) పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి దీన్ని ప్రవేశపెట్టనున్నారు. 

బెంగళూరు:   భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని లాగ్రాంజియన్-–1 (ఎల్1) పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎల్‌‌‌‌-1 పాయింట్‌‌లో శాటిలైట్‌‌ను ఉంచడం వల్ల ఎలాంటి గ్రహాలు, గ్రహణాల వంటి అడ్డంకులు లేకుండా 24 గంటలూ సూర్యుడిని అధ్యయనం చేసేందుకు వీలుంటుంది. అదేవిధంగా, రియ‌‌ల్ టైంలో స్పేస్ వెద‌‌ర్‌‌పై క‌‌లిగే ప్రభావాన్ని కూడా స్టడీ చేయ‌‌వ‌‌చ్చు. ఈ శాటిలైట్ ద్వారా చాలా దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయొచ్చు. భూమి నుంచి లాగ్రాంజియన్ పాయింట్​1కు చేరుకోవడానికి శాటిలైట్​కు దాదాపు 125 రోజులు (4 నెలలు) పడుతుంది.  అంతరిక్షంలో ఇండియాకు ఇదే తొలి అబ్జర్వేటరీగా  పని చేయనుంది. 

సూర్యుడి వాతావరణంపై అధ్యయనం 

శాటిలైట్ బరువు సుమారు 1,475 కేజీలు ఉంటుంది. శాటిలైట్​లో మొత్తం ఏడు పేలోడ్స్‌‌ ఉంటాయి. వీటి బరువు సుమారు 244 కేజీలు ఉంటాయి. 1,231 కేజీల ద్రవ ఇంధనాన్ని శాటిలైట్​లో నింపుతారు. ఆదిత్యలో ఏడు పేలోడ్లు ఉంటాయి. అవి సూర్యుడి  ఫోటోస్పియ‌‌ర్‌‌, క్రోమోస్పియ‌‌ర్‌‌, బాహ్యభాగం, సూర్యుడి కేంద్రకం కరోనాతో పాటు ఇత‌‌ర ప్రాంతాల‌‌ను స్టడీ చేయ‌‌నున్నాయి. ఎల‌‌క్ట్రోమ్యాగ్నటిక్‌‌, పార్టిక‌‌ల్‌‌, మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్లతో ఈ అధ్యయనం జరుగుతుంది. ఎల్-‌‌1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యున్ని చూస్తుంటాయి. ఇక మిగిలిన మూడు పేలోడ్లు మాత్రం ఆ పాయింట్ వ‌‌ద్ద ఉన్న మెటీరియల్​పై స్టడీ చేస్తాయి. ఈ పేలోడ్లతో సౌర వ్యవ‌‌స్థకు సంబంధించిన కీల‌‌క‌‌మైన సైంటిఫిక్ డేటా దొరుకుతుంద‌‌ని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సూళ్లూరుపేటలో ప్రత్యేక పూజలు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సీ 57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్‌‌ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు. 
ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్‌‌పీ సీ 57 రాకెట్ ప్రయోగానికి మొత్తం సిద్ధంగా ఉందన్నారు. చంద్రయాన్3 ద్వారా చంద్రుడి మీదకి చేరిన ల్యాండర్, రోవర్ విజయవంతంగా పని చేస్తున్నాయని తెలిపారు. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని ప్రకటించారు. జీఎస్ఎల్వీ మార్క్  2 ద్వారా ఇన్‌‌శాట్ 3 డీఎస్ శాటిలైట్‌‌ను నింగిలోకి పంపుతామన్నారు. నవంబర్​లో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం చేపడుతామని వెల్లడించారు.

చందమామపై సేఫ్ ల్యాండింగ్, పరిశోధనలతో ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యుడిపైనా అధ్యయనం కోసం మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ‘ఆదిత్య  ఎల్–1’ శాటిలైట్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌‌ ధవన్‌‌ స్పేస్‌‌ సెంటర్‌‌ (షార్‌‌) నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్1 శాటిలైట్​ను మోసుకుని పీఎస్ఎల్వీ–సీ 57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన 23.40 గంటల కౌంట్​డౌన్​ను శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇస్రో ప్రారంభించింది. సూర్యుడిని స్టడీ చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌‌ ఇదే. భూమికి దూరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇరవై నాలుగు గంటలూ సూర్యుడి వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. యూరోపియన్‌‌ స్పేస్‌‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సూర్యుడిపై ఈ అధ్యయనాలను చేపడుతున్నది. ఈ మిషన్‌‌ కోసం సుమారు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 

ఆదిత్య పేలోడ్లు ఇవే.. 

  వెల్క్ (విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్): ఇది 170 కిలోల బరువు ఉంటుంది. సూర్యుడి వాతావరణంలోని వేడి, మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. ఏడు పేలోడ్స్​లో ఇదే కీలకం. గ్రౌండ్ స్టేషన్​కు రోజుకు స్టడీకి సంబంధించిన 1,440 ఫొటోలు పంపుతుంది. ఇలా ఐదేండ్ల పాటు ఫొటోలు పంపుతూనే ఉంటుంది.  

  •   సూట్ (సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్): దీని బరువు 35 కిలోలు. ఇందులో 11 ఫిల్టర్లు ఉంటాయి. ఇవి సోలార్ అట్మాస్పియర్​లోని వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను తీస్తుంటాయి. అలాగే, ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ వాతావరణంలోని అల్ట్రా వైలెట్ (యూవీ) దగ్గర్లోని పరిస్థితులపైనా ఇది స్టడీ చేస్తుంది. 200–400 ఎన్‌‌ఎం పరిధిలో సూర్యుడిని గమనిస్తూ ఉంటుంది. 
  •  
  •   యాస్పెక్స్ (ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్): ఇది సోలార్ విండ్​లోని వైవిధ్యంతో పాటు వాటి లక్షణాలపై సమాచారాన్ని సేకరిస్తుంది. దీంతో పాటు సూర్యుడి వర్ణ పటం (సోలార్ స్పెక్ట్రమ్) లక్షణాలపై కూడా అధ్యయనం చేస్తుంది.  పాపా (ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య): ఈ పేలోడ్ అంతరిక్షంలోని సోలార్ విండ్ ఎనర్జీతో పాటు శక్తివంతమైన అయాన్​లపై స్టడీ చేస్తుంది.
  •  
  •   సోలెక్స్ఎస్(సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్): ఇది సూర్యుడి ఉపరితలంలో జరిగే కరోనల్‌‌ హీటింగ్‌‌ మెకానిజాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‌‌–రే ఫ్లేర్స్ పై పరిశోధనలు చేస్తుంది.

  • ఇది సూర్యుడి కరోనాలో డైనమిక్‌‌ ఈవెంట్‌‌లను గమనించడానికి ఉపయోగపడుతుంది. సూర్యుడిపై విస్ఫోటనం జరిగిన టైమ్​లో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.
  •   హెచ్​ఈఎల్​1 ఓఎస్ (హైఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్):

  • ఈపేలోడ్ ను శాటిలైట్​కు ఆన్ బోర్డు పరికరంగా అమర్చి పంపుతున్నారు. ఇది శాటిలైట్​ ఉన్న ప్రాంతానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ఆ సమాచారాన్ని పంపుతుంటుంది. 
  •   ఎంఏజీ (డిజిటల్ మ్యాగ్నెటోమీటర్):

 

ఎల్1 పాయింట్ అంటే ఏమిటి? 


భూమికి, సూర్యుడికి మధ్య అంతరిక్షంలో కొన్ని చోట్ల గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ లో లేని పాయింట్లు ఉంటాయి. వీటినే లాగ్రాంజ్ లేదా లాగ్రాంజియన్ పాయింట్ లు అంటారు. భూమి, సూర్యుడి చుట్టూ ఇలాంటివి ఐదు పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ల వద్దకు శాటిలైట్లను పంపితే అవి ఆ పాయింట్ల చుట్టూనే పెద్దగా ఇంధనం అవసరం లేకుండానే స్థిరంగా తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఆదిత్య శాటిలైట్ ను పంపే ఎల్1 పాయింట్ నుంచి సూర్యుడిపై 24 గంటలూ ఫోకస్ పెట్టేందుకు వీలుకానుంది.