ప్రధాని పర్మీషన్ ఇస్తారులే : పీవోకే లో తుక్డే..తుక్డే గ్యాంగ్ అంతు చూడండి

ప్రధాని పర్మీషన్ ఇస్తారులే : పీవోకే లో తుక్డే..తుక్డే గ్యాంగ్ అంతు చూడండి

ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే వ్యాఖ్యలకు శివసేన పార్టీ మద్దతు పలికింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమేనని చెప్పారు భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్. జమ్ము- కశ్మీర్ పూర్తిగా మనదేనని ఎప్పటి నుంచో పార్లమెంటు తీర్మానం ఉందని, అది నిజం కావాలని పార్లమెంటు కోరితే సాకారమైపోతుందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆర్డర్స్ వస్తే అప్పుడు తాము బరిలోకి దిగుతామని చెప్పారు.

అయితే ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యల్ని సమర్ధిస్తూ శివసేన అధికార పత్రిక సామ్నా కథనాన్ని ప్రచురించింది. తుక్డే..తుక్డే గ్యాంగ్ లకు వ్యతిరేకంగా విమర్శలు చేయడం కంటే ..సైన్యానికి ఓ మ్యాప్ ఇచ్చి “తుక్డే-తుక్డే”  గ్యాంగ్ ను తుడిచిపెట్టేలా  ప్రభుత్వం అనుమతివ్వాలని సామ్నా తన కథనంలో ప్రధానంగా హైలెట్ చేసింది.

ఆర్మీచీఫ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఐఎస్ ఐ సహకారంతో పీఓకేలో పాక్ ఉగ్రవాద శిక్షణా శిబిరాల్ని నిర్వహిస్తుందని ప్రచురించింది. అదే సమయంలో యూరీలో సర్జికల్ స్ట్రైక్ చేసినా పాక్ తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సంపాదకీయంలో  సైనికుల హత్య గురించి ప్రస్తావిస్తూ రాజకీయం, ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే కాశ్మీర్ సమస్య తెరపైకి వచ్చిందని సామ్నా తెలిపింది.

పీఓకేను ఆక్రమించేందుకు కేంద్ర ఆదేశాల కోసం ఆర్మీచీఫ్ వేచి ఉండడాన్ని నొక్కాణిస్తూ సంపాదకీయంలో ప్రస్తావించిన సామ్నా.. ప్రధాని నరేంద్ర మోడీ అలాంటి ఆదేశాలు ఇస్తారని, దేశం కోరుకునేది ఇదేనని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఆర్టికల్ 370 ను రద్దు చేసినందుకు హోంమంత్రి అమిత్ షాను అభినందిస్తూ, “ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ఆధ్వర్యంలో  మోడీ-అమిత్ షా నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే సొంతమవుతుందన్నారు.

ఫిబ్రవరి 1994 లో భారత పార్లమెంట్ పీవోకే సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగం” అని ఓ తీర్మానాన్ని ఆమోదించినట్లు కథనంలో పేర్కొంది సామ్నా.