అల్లు అర్జున్ తగ్గేదేలే ..థ్రెడ్స్ యాప్ లో ఐకాన్ స్టార్ హవా

అల్లు అర్జున్ తగ్గేదేలే ..థ్రెడ్స్ యాప్ లో ఐకాన్ స్టార్ హవా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) 'పుష్ప' ది రైజ్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. తనలోని డిఫరెంట్ లుక్ తో, డైలాగ్ డెలివరీ తో ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజీని సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ 'థ్రెడ్స్' యాప్(Threads App) లో 1 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి ఇండియన్ యాక్టర్ గా ఘనత ను సాధించుకున్నారు. 

ట్విట్ట‌ర్ కు ప్ర‌త్యామ్నాయంగా ఫేస్ బుక్ తీసుకు వ‌చ్చిన  ఈ థ్రెడ్స్ యాప్ లో అల్లు అర్జున్ ఒకే ఒక్క పోస్ట్ మాత్రమే చేశారు. బ్లాక్ అండ్ వైట్ కోట్ తో..కళ్ళకు స్టైలిష్ గ్లాసెస్ ను ధరించగా.. వింటేజ్ లుక్ తో ఉన్నఈ ఫోటో మెస్మరైజ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక అల్లు అర్జున్ ప్రతి సోషల్ మీడియా అకౌంట్ కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్తుంది. 

ఐకాన్ స్టార్ ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' లో నటిస్తుండగా..ఈ మూవీతో రూ.1000 కోట్ల టార్గెట్ ను రీచ్ అవ్వాలని టీం మరింత క్రియేటివిటీతో  పని చేస్తుందని సమాచారం. సుకుమార్ రైటింగ్స్‌, డైరెక్షన్ చేస్తున్న ఏ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. కాగా ఇందులో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు.