
‘పుష్ప ది రైజ్’ అంటూ రికార్డులు క్రియేట్ చేసిన అల్లు అర్జున్.. కొద్ది రోజుల్లో ‘పుష్ప 2’తో రూల్ చేయడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ‘పుష్ప-2 ది రూల్’ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. సోమవారం ట్రైలర్ అప్‌డేట్‌ను అందించారు.
ఈనెల 17న పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించబోతున్నట్టు తెలియజేశారు. దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో గన్‌ను భుజాన వేసుకుని మాసివ్ లుక్‌తో తనదైన స్వాగ్‌తో నడిచొస్తున్న అల్లు అర్జున్ స్టిల్ ఇంప్రెస్ చేస్తుంది. సుకుమార్ ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.