Rashmika Mandanna: 'కుబేరా' తర్వాత రష్మిక బోల్డ్ స్టెప్.. అల్లు అర్జున్ 'AA22XA6'లో విలన్‌గా ఎంట్రీ?

Rashmika Mandanna: 'కుబేరా' తర్వాత రష్మిక బోల్డ్ స్టెప్..  అల్లు అర్జున్ 'AA22XA6'లో విలన్‌గా ఎంట్రీ?

 వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది రష్మిక మందన్న ( Rashmika Mandanna ). ఇటీవల విడుదలైన 'కుబేరా' ( Kubera ) మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఈ బ్యూటీ ఫుల్ జోరులో ఉంది.  ఇప్పుడు ఒక సంచలనాత్మక పాత్రతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్‌లోనే తొలిసారిగా ఆమె ప్రతినాయక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది. అది కూడా ఏకంగా అల్లు అర్జున్( Allu Arjun )  హీరోగా, అట్లీ ( Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'AA22XA6' లో! ఈ వార్త అటు సినీ అభిమానుల్లో, ఇటు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, రష్మిక విలన్‌గా మారబోతోందన్న వార్త ఆ అంచనాలను పెంచుతూ  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విలన్ పాత్రకు రష్మిక గ్రీన్ సిగ్నల్: కారణం ఏమిటి?
 రష్మిక మందన్నకు 'A6' లో విలన్ పాత్రతో పాటు, మరో పెద్ద పాన్-ఇండియా చిత్రంలో కూడా ఇలాంటి పాత్రే ఆఫర్ వచ్చిందట. అయితే, రెండు పాత్రలను చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆమె 'A6' నే ఎంచుకుందని సమాచారం. దీనికి కారణం, ఈ పాత్ర ఒక నటిగా ఆమెకు కొత్త. ఇప్పటివరకు  తన కెరీర్‌లో ఎక్కువగా సాఫ్ట్, గ్లామర్ రోల్స్‌లో కనిపించింది. ఇప్పుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రష్మిక ఎలా మెప్పిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రష్మిక ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ టెస్ట్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ నుంచే షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల దర్శకుడు అట్లీ, అల్లు అర్జున్‌లతో కలిసి లాస్ ఏంజిల్స్‌కు కూడా వెళ్ళింది. అక్కడ ఆమె పాత్రకు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ (ప్రీ-విజ్) సీక్వెన్స్‌లను దర్శకుడు వారికి చూపించినట్లు సమాచారం. ఈ సినిమా మేకింగ్‌లో మేకర్స్ ఎంతో శ్రద్ధ  వహిస్తున్నట్లు తెలుస్తోంది.

 గ్లోబల్ సినిమాటిక్ స్పెషల్ గా 'AA22XA6' -
'AA22XA6' చిత్రాన్ని ఒక గ్లోబల్ సినిమాటిక్ స్పెషల్ గా తీర్చిదిద్దాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ సినిమా పరిమితులను దాటి, హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, విస్తృతమైన స్థాయిలో నిర్మిస్తున్నారు. "రష్మిక మందన్న తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన పాత్రలలో ఒకదానిలో కనిపించనుందని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి. 'పుష్ప' లో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఉన్న రోమాన్స్  కంటే ఈ చిత్రంలో వారిద్దరి మధ్య సంబంధం చాలా భిన్నంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.  ఇది సినిమా కథాంశంపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

భారీ స్టార్ కాస్ట్
ఈ చిత్రం కోసం భారీ స్టార్ కాస్ట్ పనిచేస్తున్న ట్లు సమాచారం. అల్లు అర్జున్‌తో పాటు, ఈ సినిమాలో కీలక పాత్రల్లో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్ హీరోయిన్లు నటించనున్నారు. ఇంతమంది టాప్ నటీనటులు ఒకే సినిమాలో భాగం కావడం ఈ ప్రాజెక్ట్ స్థాయిని మరింత పెంచుతోంది. ఈ భారీ కాస్ట్ ప్రేక్షకులలో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో  సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. . 2026 ద్వితీయార్థం నాటికి చిత్రీకరణ పూర్తయ్యే అవకాశం ఉంది.  షూటింగ్‌తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతాయని తెలుస్తోంది. నటీనటులకు అవుట్‌పుట్ తెలిసేలా షూట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతాయి.  త్వరలోనేఈ చిత్రానికి సంబంధించిన భారీ విజువల్ ప్రోమోతో విడుదల తేదీని ప్రకటించనుంది.

ALSO READ : Mrunal Thakur : 'మర్యాద రామన్న పార్ట్2' లో మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌లో సందడి!

2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ మేకర్స్.  'AA22XA6' పలు భాషల్లో విడుదల కానుంది. రష్మిక మందన్న నిజంగానే విలన్‌గా మారి, అల్లు అర్జున్‌తో ఢీ అంటే ఢీ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూడటానికి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.