
అల్లు శిరీష్(Allu Shirish).. అల్లు వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ వస్తున్నారు. కానీ ఎందుకో ఈ కుర్ర హీరోకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. బడా మేకర్స్, టాలెంటెడ్ దర్శకులతో పనిచేసినా సరైన ఇప్పటివరకు హిట్టు మాత్రం పడలేదు. అందుకే విజయం కోసం కష్టపడుతూనే ఉన్నారు.
అయితే అల్లు శిరీష్ వరుస సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో టచ్ లోనే ఉంటారు. ఇందులో భాగంగా తాజాగా తన ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. దానికి నెటిజన్స్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంథికి ఆ పోస్ట్ లో ఏముందంటే.. నా ఏజ్ వారందరూ కూడా అమ్మాయిలతో ఎంచక్కా తిరుగుతూ ఉంటే.. నేను మాత్రం ఇలా జిమ్ లో డంబెల్ ఎత్తుకుని వర్కౌట్లు చేస్తున్నాను.. అనే పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం శిరీష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ : రష్మీతో పెళ్లి.. దేవుడు తిప్పితే చేసుకుంటానేమో.. సుధీర్ కామెంట్స్ వైరల్
ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బడ్డీ అనే సినిమా చేస్తున్నారు. సామ్ అంటోన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తమిళలో ఆర్య హీరోగా వచ్చిన టెడ్డి సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.