కెరీర్ ఇన్​ ఫుట్‌‌‌‌వేర్ డిజైన్​

కెరీర్ ఇన్​ ఫుట్‌‌‌‌వేర్ డిజైన్​

కాలంతోపాటు ఫుట్​వేర్​ రంగమూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏటా వందల రకాల మోడల్స్​ మార్కెట్​లోకి వస్తున్నాయి. క్యాజువల్స్, పార్టీవేర్, ఆఫీస్, ఫార్మల్​ ఇలా చెప్పుకుంటూ పోతే..  చెప్పుల రకాలు ఎన్నో ఉన్నాయి. వీటిని సరికొత్త మోడల్స్​లో అందించేది, డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా మార్కెట్​లోకి తీసుకొచ్చేది ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్ డిజైనర్సే. ఫుట్‌‌‌‌‌‌‌‌వేర్ డిజైన్ అండ్ డెవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌(ఎఫ్‌‌‌‌‌‌‌‌డీడీఐ) 2023-–2024 విద్యాసంవ‌‌‌‌‌‌‌‌త్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఫుట్​వేర్​లో కెరీర్​ ఎలా ఉంటుంది.., యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్న ఇన్​స్టిట్యూట్స్​ గురించి తెలుసుకుందాం..

ఫుట్​వేర్​ రంగంలో కెరీర్​ ప్రారంభించాలనుకుంటున్న యువతకు ఫుట్‌‌‌‌వేర్ డిజైనింగ్, ప్రొడక్షన్, లెదర్ గూడ్స్, యాక్ససరీస్, ఫ్యాషన్ డిజైనింగ్‌‌‌‌లో  యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా  ఫుట్‌‌‌‌వేర్, లెదర్ డిజైన్  కోర్సులు అందించే క్యాంపస్‌‌‌‌లు 12 మాత్రమే ఉండగా హైదరాబాద్‌‌‌‌లో కూడా ఎఫ్‌‌‌‌డీడీఐ క్యాంపస్ ఉంది.

డిస్టెన్స్​లో చదివినా అర్హులే..

ఫుట్‌‌‌‌వేర్ డిజైన్, లెదర్ గూడ్స్ యాక్ససరీస్‌‌‌‌లో అడ్మిషన్  పొందాలంటే ఎఫ్​డీడీఐ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌‌‌‌ రాయాలి. ఇందులో డిగ్రీ కోర్సులకు ఇంటర్, పీజీ కోర్సులకు డిగ్రీ చదివినవారు అర్హులు. 25 ఏళ్లలోపు వయసున్న ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఎంట్రెన్స్ టెస్ట్ రాయొచ్చు. డిస్టెన్స్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఇంటర్, డిగ్రీ చదివినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

జాబ్ అపర్చునిటీస్

ఇతర రంగాలతో పోలిస్తే ప్రస్తుతం ఫ్యాషన్, ఫుట్‌‌‌‌వేర్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫుట్‌‌‌‌వేర్, లెదర్ గూడ్స్ రంగాల్లో ప్రైవేటు యూనివర్సిటీల్లో కోర్సులు అందుబాటులో లేవు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  దేశ వ్యాప్తంగా 12 క్యాంపస్‌‌‌‌లు  మాత్రమే  ఈ  కోర్సులను అందించడంతో ఇందులో కోర్సులు పూర్తి చేసినవారికి డిమాండ్ అధికంగా ఉంది. రిలయన్స్, లాండ్ మార్క్ గ్రూప్, అపెరల్ గ్రూప్ (కువైట్‌‌‌‌), పూమా, జారా, జొమాటో, బిర్లా, ఆదిత్య, సవ్యసాచి, హైడ్సన్ గ్రూప్, టాటా ఇంటర్నేషనల్ వంటి పెద్ద కంపెనీలు క్యాంపస్ సెలక్షన్స్‌‌‌‌ నిర్వహించి ప్లేస్‌‌‌‌మెంట్స్ అందిస్తున్నాయి. బీబీఏ, ఎంబీఏ కోర్సు చదివినవారికి ఏరియా మేనేజర్‌‌‌‌, ఫ్లోర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, స్టోర్‌‌‌‌ మేనేజర్‌‌‌‌, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ట్రెయినీ పోస్టులున్నాయి. ప్రెషర్స్‌‌‌‌కు ప్రారంభంలోనే ఏడాదికి రూ. 4.5లక్షల వేతనం అందుతోంది.  కేవలం 5 ఏళ్ల వ్యవధిలోనే వివిధ స్థాయిలో ప్రమోషన్ అందుకునే అవకాశం ఉంది.  

బ్యాచిల‌‌‌‌ర్ డిగ్రీ కోర్సులు (బీ.డిజైన్‌‌‌‌/ బీబీఏ)

విభాగాలు : ఫుట్‌‌‌‌వేర్‌‌‌‌ డిజైన్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌,  రిటైల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌ మర్కండైజ్‌‌‌‌

అర్హత‌‌‌‌ : ఇంట‌‌‌‌ర్మీడియ‌‌‌‌ట్ఉత్తీర్ణత‌‌‌‌. ప్రస్తుత విద్యాసంవ‌‌‌‌త్సరంలో ఇంట‌‌‌‌ర్మీడియ‌‌‌‌ట్ రెండో ఏడాది ప‌‌‌‌రీక్షల‌‌‌‌కు హాజ‌‌‌‌ర‌‌‌‌వుతున్న విద్యార్థులు ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకోవ‌‌‌‌చ్చు. ఇంగ్లిష్‌‌‌‌లో మంచి క‌‌‌‌మ్యూనికేష‌‌‌‌న్ స్కిల్స్ ఉండాలి. వయసు 25 ఏండ్లకు మించకూడదు. 

ఎగ్జామ్ ప్యాటర్న్​ : ఈ ప‌‌‌‌రీక్షను పేప‌‌‌‌ర్ బేస్డ్ ప‌‌‌‌ద్ధతిలో నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. దీన్ని 200 మార్కుల‌‌‌‌కు నిర్వహిస్తారు, 150 ప్రశ్నలు ఉంటాయి. 

మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్​ (ఎం.డిజైన్‌‌‌‌/ ఎంబీఏ) విభాగాలు : మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఫుడ్ వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌‌‌‌క్షన్‌‌‌‌), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌‌‌‌న్(ఎంబీఏ-రిటైల్ అండ్ ఫ్యాష‌‌‌‌న్ మ‌‌‌‌ర్కండైజ్‌‌‌‌) 

అర్హత‌‌‌‌ : పుట్‌‌‌‌వేర్‌‌‌‌/ లెద‌‌‌‌ర్ గూడ్స్‌‌‌‌/ డిజైన్‌‌‌‌/ ఫ్యాష‌‌‌‌న్/ ఫైన్ ఆర్ట్స్/ ఆర్కిటెక్చర్‌‌‌‌/ ఇంజినీరింగ్‌‌‌‌/ ప్రొడ‌‌‌‌క్షన్‌‌‌‌లో బ్యాచిల‌‌‌‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణత‌‌‌‌.ఇంగ్లిష్‌‌‌‌లో మంచి క‌‌‌‌మ్యూనికేష‌‌‌‌న్ స్కిల్స్ ఉండాలి. మాస్టర్ డిగ్రీ కోర్సులకు వ‌‌‌‌య‌‌‌‌సుతో సంబంధం లేదు.

పరీక్ష విధానం ​:  మాస్టర్స్ ప్రోగ్రాముకి సంబంధించి 175 ప్రశ్నలు, 200 మార్కుల‌‌‌‌కు ఈ ప‌‌‌‌రీక్ష ఉంటుంది. 

ఎఫ్‌‌‌‌డీడీఐ హైదరాబాద్​ 

హైదరాబాద్‌‌‌‌లో ఎఫ్​డీడీఐ క్యాంపస్‌‌‌‌ను 2017లో ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి ప్రాంతంలోని  రాయదుర్గం చెరువు సమీపంలో క్యాంపస్‌‌‌‌ ఉంది. ఇక్కడ ఫుట్‌‌‌‌వేర్, లెదర్ గూడ్స్, అక్సెసరీస్,  ఫ్యాషన్ డిజైనింగ్‌‌‌‌లో డిగ్రీ, పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్‌‌‌‌ కోసం హాస్టల్ ఫెసిలిటీ ఉంది.  లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న మిషన్స్‌‌‌‌తో స్టూడెంట్స్‌‌‌‌కు ట్రైనింగ్ ఇస్తున్నారు.  యూజీ కోర్సులు  (బీడీఈఎస్‌‌‌‌) ఫుట్‌‌‌‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్‌‌‌‌, ఫ్యాషన్ డిజైనింగ్‌‌‌‌లో, లెదర్ గూడ్స్ అండ్ యాక్ససరీస్ డిజైన్‌‌‌‌, రిటైల్ ఫ్యాషన్ మర్చండైజ్‌‌‌‌(బీబీఏ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ విభాగంలో రిటైల్ ఫ్యాషన్ మర్చండైజ్ (ఎంబీఏ) ప్రోగ్రామ్​లో ఖాళీలు ఉన్నాయి. ఎఫ్‌‌‌‌డీడీఐలో యూజీ  విభాగంలో మూడు కోర్సులు, పీజీ విభాగంలో రెండు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.   ఏడాదికి రెండు చొప్పున   డిగ్రీలో 8 సెమిస్టర్లు, పీజీలో 4 సెమిస్టర్లు ఉంటాయి.  ప్రతి సెమిస్టర్‌‌‌‌‌‌‌‌లో 40 శాతం థియరీ క్లాసులు, 60 శాతం ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి.  లేటెస్ట్ డిజైన్లు, మిషన్లపై స్టూడెంట్స్‌‌‌‌కు ట్రైనింగ్ ఇస్తారు. 

నోటిఫికేషన్​

సీట్లు : 2300 (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌‌‌‌ సీట్లు 230 అందుబాటులో ఉన్నాయి) 

కోర్సులు :  బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డిజైన్‌‌‌‌:  ఇందులో ఫుట్‌‌‌‌వేర్‌‌‌‌ డిజైన్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌, లెదర్‌‌‌‌, లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌ డిజైన్‌‌‌‌, ఫ్యాషన్‌‌‌‌ డిజైన్ విభాగాల్లో అడ్మిషన్స్​ కల్పిస్తారు. ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సులకు నాలుగేళ్ల డ్యూరేషన్​ ఉంటుంది.

బీబీఏ : ఈ కోర్సుకు మూడేళ్ల డ్యూరేషన్​ ఉంటుంది. డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాచిలర్‌‌‌‌ డిగ్రీ అప్లై చేసుకునే అభ్యర్థులు 25 ఏళ్లు మించకూడదు.
పీజీ మాస్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ డిజైన్‌‌‌‌: ఫుట్‌‌‌‌వేర్‌‌‌‌ డిజైన్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ ఈ కోర్సుకు ఫుట్‌‌‌‌వేర్‌‌‌‌ / లెదర్‌‌‌‌ గూడ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ యాక్సెసరీస్‌‌‌‌ డిజైన్‌‌‌‌ / డిజైన్‌‌‌‌ / ఇంజినీరింగ్‌‌‌‌ / ప్రొడక్షన్‌‌‌‌/ టెక్నాలజీల్లో బ్యాచిలర్‌‌‌‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల డ్యూరేషన్​ ఉంటుంది.

ఎంబీఏ : రిటైల్‌‌‌‌ అండ్‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌ మర్చెండైజ్‌‌‌‌ విభాగంలోని ఈ కోర్సుకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఆల్‌‌‌‌ ఇండియా సెలక్షన్‌‌‌‌ టెస్ట్‌‌‌‌(ఏఐఎస్‌‌‌‌టీ) 2023 పరీక్షలో మెరిట్‌‌‌‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్​ 18న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు  www.fddiindia.com వెబ్​సైట్​లో సంప్రదించాలి. 

– వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్​