దక్షిణాదిలో అల్పెట్స్ క్లినిక్ విస్తరణ  

దక్షిణాదిలో అల్పెట్స్ క్లినిక్ విస్తరణ  

హైదరాబాద్​, వెలుగు: పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే ఆల్పెట్స్ క్లినిక్ విస్తరణ బాట పట్టింది. రాబోయే 12 నెలల్లో దక్షిణాదిలో 10 కొత్త క్లినిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‎లో గురువారం రెండో సెంటర్‎ను ప్రారంభించింది. పెంపుడు జంతువుల యజమానులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించకుండా నాణ్యమైన వైద్యం అందించడమే ఈ క్లినిక్ ముఖ్య ఉద్దేశమని సీఈవో జస్లీన్ కౌర్ తెలిపారు.