ఉమెన్స్ వరల్డ్ కప్: ఇంగ్లాండ్‎కు 356 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఆసీస్

ఉమెన్స్ వరల్డ్ కప్: ఇంగ్లాండ్‎కు 356 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఆసీస్

క్రైస్ట్‌‌‌‌‌‌చర్చ్‌‌‌‌ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‎లో ఆసీస్ ప్లేయర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 356 పరుగులు చేశారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్ కు వచ్చిన ఓపెనర్లు వైస్ కెప్టెన్ అలీసా హీలీ 138 బంతుల్లో 170 పరుగులు, రాచెల్ హేన్స్ 93 బంతుల్లో 68 పరుగులు చేసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. మరో ప్లేయర్ బెత్ మూనీ 47 బంతుల్లో 62 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ అన్య ష్రబ్ సోల్ 3 వికెట్లు తీసి 46 పరుగులిచ్చింది.

ఓవైపు ఆరుసార్లు చాంపియన్‌‌‌‌ ఆస్ట్రేలియా.. మరోవైపు డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌.. ఈ రెండింటి మధ్య విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ అంటే అందరిలో ఏదో ఆసక్తి.  ఈ మ్యాచ్‌‌‌‌లో ఇరుజట్లూ టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగాయి. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గిన కంగారూలు ఫేవరెట్‌‌‌‌గా కనిపిస్తున్నా... తొలి మూడు మ్యాచ్‌‌‌‌ల్లో ఓడి ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఇంగ్లండ్‌‌‌‌నూ తక్కువగా అంచనా వేయలేం. ఎలాగైనా ఈ మ్యాచ్‌‌‌‌లో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్‌‌‌‌ను నిలబెట్టుకోవాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 152 సార్లు తలపడగా ఆసీస్‌‌‌‌ 84, ఇంగ్లండ్‌‌‌‌ 61 మ్యాచ్‌‌‌‌ల్లో గెలిచాయి.  

గెలుపు కొనసాగేనా..?
ఏడో టైటిల్‌‌‌‌ వేటలో ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి వరుసగా 11వ విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ ఒక్కసారి మాత్రమే ఫైనల్లో ఓడింది. 2000 వరల్డ్ కప్  టోర్నీలో న్యూజిలాండ్‌‌‌‌ చేతిలో పరాజయంపాలైంది. 2017 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో సెమీస్‌‌‌‌ వరకు వచ్చిన ఆసీస్‌‌‌‌కు... టీమిండియా చేతిలో చుక్కెదురైంది. ఈ రెండు మినహా మెగా టోర్నీలో కంగారూలకు తిరుగులేదన్నది నిజం. టీమ్‌‌‌‌ పరంగా ఆసీస్‌‌‌‌కు ఎలాంటి ఇబ్బందుల్లేవు. బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌లో కంగారూలను కొట్టే ప్రత్యర్థి ఈ టోర్నీలో కనిపించలేదు. వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అలీసా హీలీ సూపర్ ఫామ్‌‌‌‌లో ఉండి.. 508 పరుగులతో టోర్నిలో టాప్ స్కోరర్ గా నిలిచింది. రాచెల్‌‌‌‌ హేన్స్‌‌‌‌ 429 రన్స్‌‌‌‌ తో సెకండ్ టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌గా ఉంది. 

ప్రతీకారం కోసం.. 
మరోవైపు సెమీస్‌‌‌‌ చేరడమే కష్టమనుకున్న దశలో అద్భుత విజయాలు సాధించిన ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ కోసం పక్కాగా రెడీ అయ్యింది. లీగ్‌‌‌‌ దశలో ఆసీస్‌‌‌‌ చేతిలో ఎదురైన ఓటమికి, గత రెండు వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌లో ఎదురైన పరాజయాలకు ఈ  టైటిల్‌‌‌‌తో ప్రతీకారం తీర్చుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. బ్యూమెంట్‌‌‌‌, వ్యాట్‌‌‌‌, నైట్‌‌‌‌, నటాలియా, డంక్లే, సీవర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం ఇంగ్లండ్‌‌‌‌కు కలిసొచ్చే అంశం. వీళ్లలో ఏ ఇద్దరు ఆడినా లక్ష్యాన్ని చేధించడం ఖాయం.

For More News..

వాహనదారులపై ఆర్టీఏ ఫైన్ల మోత