–ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారం ముగిసిందని మున్సిపల్ కమిషనర్ శంకర్ వెల్లడించారు. ఈనెల 23న జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవడంతో వాయిదా పడగా, తాజాగా చైర్ పర్సన్ పత్య నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నలుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జనరల్ మహిళా కోటాలో కండే సీత రాములమ్మ, జనరల్ స్థానంలో చుక్క అల్లాజీ గౌడ్, మైనార్టీ మహిళా స్థానంలో హలీమా బేగం, మైనార్టీ జనరల్ స్థానంలో అబ్దుల్ ఖాదర్ ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన సభ్యులకు చైర్మన్, వైస్ చైర్ పర్సన్ తల్లోజు గీత కలిసి ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

