బెస్ట్ ఎంప్లాయర్స్ లిస్టులో.. అమర రాజా గ్రూపుకు చోటు

 బెస్ట్ ఎంప్లాయర్స్ లిస్టులో.. అమర రాజా గ్రూపుకు చోటు

హైదరాబాద్​, వెలుగు:  ఫోర్బ్స్ ప్రచురించిన వరల్డ్స్​ బెస్ట్​ ఎంప్లాయర్స్​ లిస్టులో బ్యాటరీల కంపెనీ అమర రాజా గ్రూప్​కు స్థానం దక్కింది. ఉద్యోగుల- కేంద్రీకృత సంస్థను నిర్మించడంలో గ్రూప్ నిబద్ధతను తెలియజేస్తోందని కంపెనీ ప్రకటించింది.  భారతదేశం నుంచి కేవలం ఆరు కంపెనీలు మాత్రమే ఈ సంవత్సరం గ్లోబల్ లిస్ట్‌‌లో చోటు దక్కించుకోగా, వాటిలో అమర రాజా ఒకటి. 

ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో చేరిన 31  గ్రూపుల్లో అమర రాజా కూడా ఉంది. ఈ కేటగిరీలో ఇది 28వ స్థానంలో నిలిచింది. ఈ గుర్తింపు అమర రాజా ప్రత్యేకమైన ఉద్యోగుల విధానాలు, నిరంతర అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని గ్రూప్ చైర్మన్ కో–ఫౌండర్​ గల్లా జయదేవ్ తెలిపారు.