తేజేష్ రాజన్ హీరోగా రాఘవ లారెన్స్ శిష్యుడు తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమరం’. ఐరా అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా నాగినీడు, సాయి ధీనా, జార్జ్ మరియన్, సురేష్ చంద్ర మీనన్, హరీష్ పరాడి కీలక పాత్రలు పోషించారు. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ఓ ట్రైబల్ స్మగ్లర్, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది.
వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఓ జంట అనుకోని పరిస్థితుల్లో చేసే ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు మెయిన్ కాన్సెప్ట్. ఇంటెన్స్ యాక్షన్‌తో కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, ఎదురయ్యే ప్రమాదాలతో పాటు అక్కడి సామాజిక సమస్యలను ఇందులో ప్రజెంట్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
