Heavy rains: ఎడతెరిపిలేని వర్షాలు..అమర్నాథ్ యాత్రకు బ్రేక్..బేస్ క్యాంపుల్లోనే 50 వేల మంది యాత్రికులు

Heavy rains: ఎడతెరిపిలేని వర్షాలు..అమర్నాథ్ యాత్రకు బ్రేక్..బేస్ క్యాంపుల్లోనే 50 వేల మంది యాత్రికులు

ఉత్తరాదిలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలతో  నదులు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాలకు 24 గంటల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో మూడోరోజూ అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. అమర్ నాథ్ యాత్రకు వచ్చిన భక్తులంతా పంచతర్ణి వద్ద చిక్కుకున్నారు.  కుండపోత వానలతో పహల్ గామ్ మార్గంలో వెళ్లిన యాత్రికులు పంచతరణి వద్ద 1,500 మంది బేస్ క్యాంపుల్లో ఉండిపోయారు.   కొండచరియలు విరిగి పడుతుండటంతో జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేశారు. మెరుపు వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. వదరల్లో చిక్కుకున్న ఆరుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

ప్రఖ్యాత అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్లోని బాల్తాల్, పహల్ గామ్ యాత్ర రూట్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో అమర్ నాథ్  యాత్రను ఆపేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సుమారు 50 వేల మంది యాత్రికులు బేస్  క్యాంపుల్లోనే ఉన్నారు.యాత్ర ప్రారంభించిన మరికొంతమంది భక్తులు..రూట్ మధ్యలోచిక్కుకపోవటంతో భద్రతా సిబ్బంది వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పిష్యూటాప్ వద్ద కొండచరియలు విరిగిపడుతుండటంతో యాత్రికులను తరలించేందుకు చర్యలు చేపట్టారు. యాత్ర మార్గంలో భారీగా బురద ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గుతోంది.

రంబన్  వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్ము నుంచి బయల్దేరిన యాత్రికులను మధ్యలోనే నిలిపివేశారు. సమీపంలోని బేస్ క్యాంప్ లకు తరలించారు. యాత్రికులు ముందుకు వెళ్లడానికి అనుమతించలేదు. అటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల బేస్ క్యాంపుల్లో భజనలు చేస్తున్నారు. యాత్ర త్వరగా ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.
.
వర్షాల దృష్ట్యా పేర్ల నమోదు, టోకెన్ల జారీని నిలిపివేశారు. యాత్రికులంతా సురక్షితంగానే ఉన్నారని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.