భారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

భారీ వర్షాలతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం(జున్ 14) న రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం పహల్గామ్,  బల్తాల్ మార్గాల నుండి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పవిత్ర గుహ మందిరం వైపు యాత్రికులను అనుమతించడంలేదు. వాతావరణం అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.   అంతకుముందు జూలై 5 న భారీ వర్షాలు, జూలై 8న 16 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గల్లంతు కావడంతో  యాత్రను నిలిపివేశారు.  తిరిగి సోమవారం పహల్గామ్ మార్గంలో, మంగళవారం బల్తాల్ మార్గంలో యాత్ర తిరిగి ప్రారంభం కాగా ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటివరకు 1,44,457 మంది యాత్రికులు దర్శనం చేసుకున్నట్టుగా అధికారులు వెల్లడించారు. యాత్రికుల కోసం రెండు మార్గాల్లో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి.  రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న యాత్ర ముగియనుంది.