కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

కొండచరియలు విరిగిపడటంతో నిలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర

అమర్‌నాథ్ యాత్రకు మరోసారి ఆటంకం ఏర్పడింది. ఆగస్టు 9న జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి 44పై కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు అధికారులు అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. T2 మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికే జమ్మూ-శ్రీనగర్ NH బ్లాక్ చేశారు. ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ (TCUs) నుంచి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా ఎవరూ NH-44లో ప్రయాణించవద్దని జుమ్మూ & కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. జాతీయ రహదారిని క్లియర్ చేసిన తర్వాత యాత్ర మళ్లీ పునఃప్రారంభించనట్టు తెలుస్తోంది. జూలై 1న ప్రారంభమైన 62 రోజుల అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 31, 2023 (గురువారం)తో ముగుస్తుంది.

అంతకుముందు, ఆగస్టు 17న ప్రారంభం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, బుద్దా అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్, జమ్మూ డివిజనల్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం పూంచ్‌లోని పౌర సంఘం సభ్యులతో జమ్మూ ఏడీజీపీ, డివిజనల్ కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సజావుగా నిర్వహించేందుకు, యాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని వక్తలందరూ అధికారులకు తెలియజేశారు.